Karthika Deepam 2 : భార్య తాళిని తెంపేసిన భర్త.. షాక్ లో ఆ ఇద్దరు!
on Oct 12, 2024
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(karthika Deepam 2). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -173 లో.....సుమిత్ర కాంచనలని ఒకటి చెయ్యాలని ఇంట్లో పూజ చేస్తారు. కాంచన రావడంతో సుమిత్ర చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. శౌర్యని బాల త్రిపుర సుందరిదేవి లాగా రెడీ చేస్తారు. ఆ తర్వాత పూజ చేస్తారు. పూజ పూర్తి అయ్యాక.. నువ్వు పెళ్లి గురించి మాట్లాడమని పారిజాతంతో జ్యోత్స్న అంటుంది. నేను చూసుకుంటానని పారిజాతం అంటుంది. ఆ తర్వాత దశరథ్, శివన్నారాయణ వస్తారు. అదంతా చూసి షాక్ అవుతారు. వాళ్లని చూసి ఇంట్లో వాళ్ళు షాక్ అవుతారు. పూజ జరుగుతుంది. పూజ పూర్తి చెయ్యండి. ఆ తర్వాత మాట్లాడుదామని శివన్నారాయణ అంటాడు.
ఆ తర్వాత పూజ పూర్తి అయింది. జంటలుగా వచ్చి ఆశీర్వాదం తీసుకోండి అని సుమిత్ర అనగానే.. ఇక్కడ అందరూ జంటలుగా ఏం లేరు అని శివన్నారాయణ అంటాడు. సుమిత్ర, దశరథ్ లు మీరు ఆశీర్వాదం తీసుకోండి అంటాడు. ఆ తర్వాత శివన్నారాయణ, పారిజాతంలు తీసుకుంటారు. అత్తయ్య, శౌర్యని తీసుకొని వెళ్ళండి. దిష్టి తీసి లోపలికి తీసుకొని వెళ్ళండి అని దీప చెప్తుంది. అనసూయ శౌర్యని తీసుకొని వెళ్లి.. ఇక్కడే ఉండు అంటూ లోపలికి వెళ్తుంది. ఆ తర్వాత ఎవరు పిలిస్తే వచ్చారో అడగను.. ఇక వెళ్ళండి అని శివన్నారాయణ అంటాడు. సుమిత్ర నీకు గుడ్ న్యూస్ జ్యోత్స్నకి పెళ్లి ఫిక్స్ అయింది. మచ్చ లేని గౌరవం అయిన కుటుంబం అది అని చెప్తాడు శివన్నారాయణ. నొక్కి మరి చెప్పాలా అంటూ కార్తీక్ కోపంగా కాంచనని తీసుకొని వెళ్తాడు. నేను బావని తప్ప ఎవరిని చేసుకోనంటూ జ్యోత్స్న చెప్పి వెళ్తుంది. ఆ తర్వాత దీప ఏదో మాట్లాడబోతుంటే.. తర్వాత మాట్లాడుదామని సుమిత్ర అంటుంది.
ఆ తర్వాత అనసూయ బయటకు వచ్చేసరికి శౌర్య ఉండదు. దీప కూడా వస్తుంది.. శౌర్య కన్పించకపోయేసరికి ఇద్దరు బయటకు వస్తారు. శౌర్య కిరీటం గేట్ ముందు కన్పిస్తుంది. దాంతో వెతుకుంటూ వెళ్తారు. మరొకవైపు శౌర్యని నరసింహా ఎత్తుకొని వెళ్తాడు. తనని తప్పించుకొని శౌర్య ఒక దగ్గర దాక్కొని ఉంటుంది. అయిన నరసింహా కనిపెడతాడు. అప్పుడే అనసూయ, దీపలు వస్తారు. బూచోడు అంటూ శౌర్య భయపడుతుంది. వదులు.. విడాకులు ఇచ్చాను.. ఇంకా నాతో సంబంధమేంటని దీప అనగానే.. ఇదిగో అంటూ తాళి చూపిస్తాడు. ఆ తాళిని గట్టిగా పట్టుకుంటాడు సీతాకాంత్. వదులు అని దీప అంటుంది. తాళి తెగిపోయి మంటలో పడుతుంది. దీప, అనసూయ షాక్ అవుతారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Also Read